Vallabhaneni Vamsi: లోకేశ్ వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శించా: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi explains his past comments

  • టీడీపీకి దూరంగా ఉంటున్న వల్లభనేని వంశీ
  • తానెప్పుడూ పార్టీని విమర్శించలేదని వెల్లడి
  • టీడీపీ చాలా గొప్పదని వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వల్లభనేని వంశీకి, టీడీపీకి మధ్య దూరం పెరిగింది. టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు. తాజాగా, హనుమాన్ జంక్షన్ లో ఓ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి వల్లభనేని వంశీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను ఎప్పుడూ టీడీపీని విమర్శించలేదని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని అభివర్ణించారు. టీడీపీ చెడ్డదని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. కానీ, లోకేశ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శించానని వివరణ ఇచ్చారు.

Vallabhaneni Vamsi
Nara Lokesh
TDP
YSRCP
  • Loading...

More Telugu News