Gopichand: 'పక్కా కమర్షియల్' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!

Pakka Commercial song promo released

  • మారుతి నుంచి 'పక్కా కమర్షియల్'
  • మరోసారి గోపీచంద్ తో జోడీకట్టిన రాశి ఖన్నా
  • జూన్ 1వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ 
  • జూలై 1వ తేదీన సినిమా విడుదల 

ఇటు యూత్ .. అటు మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ కూడా బాగా తెలిసిన దర్శకుడిగా మారుతి కనిపిస్తాడు. వినోదమే ప్రధానంగా ఆయన సినిమాలు కొనసాగుతాయి. తన తాజా చిత్రంగా ఆయన 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 కలిసి ఈ సినిమాను నిర్మించాయి. 

విభిన్నమైన కథాకథనాలతో మారుతితో రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. 'జిల్' తరువాత వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 

'అందాల రాశి మేకప్పేసి .. నాకోసమొచ్చాదే' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. ప్రత్యేకంగా వేసిన బ్యూటిఫుల్ సెట్లో నాయకా నాయికలపై ఈ పాటను చిత్రీకరించారు. ఫుల్ సాంగ్ ను జూన్ 1వ తేదీన వదలనున్నట్టు చెప్పారు.  ఇక ఈ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gopichand
Rashi Khanna
Maruthi Movie

More Telugu News