NTR: నిమ్మకూరులో సందడే సందడి.. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయన్న బాలయ్య

Balakrishna in Nimmakuru and attend NTR Birth Anniversary

  • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బాలకృష్ణ
  • వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్న బాలయ్య

దివంగత నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు నిమ్మకూరు వచ్చిన ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాలయ్య రాకతో నిమ్మకూరులో సందడి వాతావరణం నెలకొంది.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..  ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఎప్పటికీ ఉంటాయన్నారు. తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.  మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్న ఆయనకు వందనాలని బాలకృష్ణ పేర్కొన్నారు.

NTR
Balakrishna
NTR Birth Anniversary
Nimmakuru
Krishna District
  • Loading...

More Telugu News