Junior NTR: తారకరాముడి శత జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తారక్, కల్యాణ్‌రామ్

Jr NTR and Kalyan Ram paying tributes at NTR Ghat

  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద శతజయంతి వేడుకలు
  • పెద్ద ఎత్తున తరలివస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
  • పుష్ఫ గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన తారక్, కల్యాణ్ రామ్
  • ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. 

కాగా, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్.. సదా మీ సేవలో.. అంటూ ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. అని రాసుకొచ్చారు.

Junior NTR
Kalyan Ram
NTR
NTR Ghat
NTR Birth Anniversary

More Telugu News