Botsa Satyanarayana: మహానాడులో చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడంలేదు: బొత్స

Botsa slams Chandrababu

  • వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రి బొత్స
  • బాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య 
  • చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టీకరణ

వైసీపీ నేతలు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపట్టడం తెలిసిందే. ఈ బస్సు యాత్రలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అధ్యాయం ముగిసిందని, మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టం చేశారు. చంద్రబాబు మహానాడులో చెబుతున్న అబద్ధాలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని బొత్స వ్యాఖ్యానించారు. మామను చంపి తద్దినం పెట్టిన బాబు, ఇప్పుడు ఏ విధంగా మహానాడు జరుపుతాడు? అంటూ మండిపడ్డారు. 

గతంలో చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేశాడని, వరల్డ్ బ్యాంకు బిచ్చగాడు అంటూ చంద్రబాబుకు ముద్రపడిందని అన్నారు. ఇటీవల కోనసీమలో జరిగిన అల్లర్లతో చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని బొత్స విమర్శించారు.

Botsa Satyanarayana
Chandrababu
TDP Mahanadu
YSRCP
  • Loading...

More Telugu News