Telugudesam: ఎన్టీఆర్ కు నివాళితో.. ప్రారంభమైన మహానాడు వేడుకలు.. వేలాది మందితో కిక్కిరిసిన సభాప్రాంగణం!

TDP Mahanadu starts in Ongole

  • ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు
  • జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన చంద్రబాబు
  • ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు నివాళి అర్పించిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభమయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ కోసం ప్రాణాలను అర్పించిన కార్యకర్తలకు తొలుత నివాళి అర్పించారు.  

మరోవైపు, ఈ కార్యక్రమానికి వేలాదిగా తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కార్యక్రమం కావడంతో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉప్పొంగుతోంది. మరోవైపు ఈ కార్యక్రమం కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఇతర కీలక నేతలు దాదాపు 200 మందికి పైగా వేదికపై ఆసీనులయ్యారు.

Telugudesam
TDP Mahanadu
Chandrababu
  • Loading...

More Telugu News