TDP: తప్పుడు లెక్కలు రాసి ఇలా తయారయ్యాడు... విజ‌య‌సాయిరెడ్డిపై అయ్య‌న్న కామెంట్‌

ayyannapatrudu satires on vijay sai reddy

  • సాయిరెడ్డికి స‌రైన లెక్క‌లు రాసే లింక్ తెగిపోయిందన్న అయ్యన్న 
  • ఆయ‌న‌ను ఎక్క‌డా చూపించాల్సిన అవ‌స‌రం లేదని కామెంట్ 
  • జ‌గ‌న్‌తో క‌లిసి ఉంటే ఒక‌రికొక‌రు మందులిచ్చుకోవ‌చ్చ‌న్న అయ్య‌న్న‌

ట్విట్టర్ వేదిక‌గా అధికార పార్టీ వైసీపీకి చెందిన కీల‌క నేత‌ల‌పై విమ‌ర్శ‌లు సంధిస్తూ వ‌స్తున్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు గురువారం మ‌రో ట్వీట్ వ‌దిలారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై సెటైర్లు సంధిస్తూ వ‌దిలిన ఈ ట్వీట్‌లో అయ్యన్న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. స‌రైన లెక్క‌లు రాసే లింక్ విజ‌య‌సాయిరెడ్డికి తెగిపోయింద‌ని ఈ ట్వీట్‌లో అయ్య‌న్న వ్యంగ్యాస్త్రం సంధించారు.

రోజూ నీతులు చెప్పే విజ‌య‌సాయిరెడ్డికి మెదడుకి, చేతికి ఉండాల్సిన "సరైన లెక్కలు" రాసే లింక్ తెగిపోయిందన్న అయ్య‌న్న‌.. తప్పుడు లెక్కలు రాసి ఆయ‌న‌ ఇలా తయారయ్యాడంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సాయిరెడ్డికి ఎక్కడా చూపించనక్కర్లేదని కూడా చెప్పారు. జగన్ రెడ్డితో ఉంటే ఒకరికి ఒకరు మందులు టైం కి ఇచ్చుకోవచ్చంటూ అయ్య‌న్న‌ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు.

TDP
Ayyanna Patrudu
Vijay Sai Reddy
YSRCP
Twitter

More Telugu News