Venkatesh Daggubati: 'ఎఫ్ 3' ప్రమోషన్స్ లో కనిపించని తమన్నా .. అలిగిందంటూ టాక్!

F3 movie update

  • 'ఎఫ్ 3' లో ప్రధానమైన నాయికగా తమన్నా
  •  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె రాకపోవడంతో మొదలైన గుసగుసలు 
  • తన పాత్ర నిడివి తగ్గించడంతో అలిగిందంటూ టాక్
  • అందువల్లనే ప్రమోషన్స్ కి దూరంగా ఉందంటూ ప్రచారం 

తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తమ సినిమాల్లో గ్లామర్ పాళ్లు తగ్గిందని అనిపిస్తే స్పెషల్ సాంగ్ కోసం ముందుగా తమన్నాను సంప్రదించేవారే ఎక్కువ. అలాంటి తమన్నా ఉన్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వేరే భామను దింపితే ఆమె ఫీలైపోదూ. 'ఎఫ్ 3' సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమన్నా రాకపోతే ఆమె బిజీగా ఉందని చెప్పేసి కవర్ చేశారు. కానీ ఆ తరువాత ఇంతవరకూ కూడా ఆమె ఒక్క ఇంటర్వ్యూలోను కనిపించలేదు. అసలు ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ గురించే పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. అందుకు కారణం ఆమె అలగడమనే అంటున్నారు. 

'ఎఫ్ 2' లో అందాల సందడి చేసిన తమన్నా, 'ఎఫ్ 3' లోను తనదే పై చేయి అనుకుని ఉంటుంది. కానీ హఠాత్తుగా సోనాల్ చౌహాన్ ను రంగంలోకి దింపారు. ఆమెకి ఒక కీలమైన పాత్రను ఇచ్చి, అందాల సందడి చేయించారు. పోనీలే ఆమెతో నాకు పోటీ ఏంటి? అని తమన్నా అనుకుంటే, ఆపై పూజ హెగ్డేను తీసుకుని వచ్చారు. 'మంది ఎక్కువైతే మజ్జిగ పలచన' అన్నట్టు తన పాత్రను తగ్గించారనే అలకతోనే ఆమె ప్రమోషన్స్ కి రావడం మానేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

Venkatesh Daggubati
Thamannah
Anil Ravipudi
F3 Movie
  • Loading...

More Telugu News