Telugudesam: మహానాడు కోసం ఒంగోలుకు చంద్రబాబు.. విజయవాడ నుంచి ఒంగోలుకు బైక్ ర్యాలీ

Chandrababu going to Ongole to attend Mahanadu

  • రేపు, ఎల్లుండి ఒంగోలులో మహానాడు
  • ఈరోజు ఒంగోలుకు చేరుకోనున్న చంద్రబాబు
  • మూడు రోజుల పాటు అక్కడే బస

తెలుగుదేశం పార్టీ పండుగగా భావించే మహానాడును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ఒంగోలుకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే మకాం వేయనున్నారు.

ఇక ఒంగోలుకు చంద్రబాబు పర్యటన సందర్భంగా విజయవాడ నుంచి ఒంగోలు వరకు టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ బైక్ ర్యాలీకి ప్రకాశం జిల్లా సరిహద్దు మార్టూరు వద్ద టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశాయి.  

ఈ మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడులో చర్చించే కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు మహానాడు సభకు స్థలం ఇవ్వకపోవడం, ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు, ప్రైవేటు వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని చెపుతున్నారు. 

Telugudesam
TDP Mahanadu
Chandrababu
Ongole
  • Loading...

More Telugu News