Hyder​abad: హైదరాబాద్ లో అలర్ట్.. కొత్తగా ఒమిక్రాన్ బీఏ 5 కేసు

another person has tested positive for BA 5 sub variant

  • న్యాయ సలహాదారుగా పనిచేసే వ్యక్తిలో గుర్తింపు
  • స్వల్ప లక్షణాలే.. ఇంట్లోనే ఉంచి చికిత్స
  • వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదన్న వైద్య అధికారులు

రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ 5 కేసు వెలుగు చూసింది. కొన్ని రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ బీఏ 4 వైరస్ ను గుర్తించడం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తికి బీఏ 5 వేరియంట్ పాజిటివ్ గా ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లో న్యాయ సలహాదారుగా సేవలు అందించే వ్యక్తిలో ఇది బయటపడింది. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

సదరు వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఇద్దరి నమూనాలను పరీక్ష కోసం పంపారు. అధికారులు గత 10 రోజులుగా ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం వచ్చే నమూనాలకు జీనోమ్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు. బీఏ 4 వేరియంట్ వ్యాపించడం లేదని అధికారులు ప్రకటించారు. దేశంలో బీఏ 5 మొదటి కేసు గుజరాత్ లో వెలుగు చూసినట్లు అంతర్జాతీయ డేటా స్పష్టం చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని వైద్య అధికారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పటికిప్పుడు కేసులు భారీగా పెరిగే అవకాశమే లేదన్నారు. 

గతంలో మాదిరి కరోనా విస్తరణ ప్రస్తుతం లేకపోవడంతో వైద్య అధికారులు సైతం ఆందోళన చెందడం లేదు. ఇటీవలే 19 ఏళ్ల వ్యక్తిలో బీఏ 4 బయటపడగా, ఆ వ్యక్తి తల్లిలో కూడా బీఏ 2 వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. లక్షణాలు చాలా స్పల్పంగానే ఉండడం అధికారులకు ఊరటనిస్తోంది. 

Hyder​abad
alert
BA 5
postive
corona
  • Loading...

More Telugu News