Venkatesh Daggubati: 'ఎఫ్ 4'లో మరో స్టార్ హీరో ఉంటాడు: అనిల్ రావిపూడి

Ani  Ravipudi Interview

  • 'ఎఫ్ 3' ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి
  • 'ఎఫ్  2'ను మించిన ఫన్ ఉంటుందంటూ హామీ 
  • ఇద్దరు హీరోల పాత్రలకి ఆ లోపం పెట్టింది అందుకేనంటూ వివరణ 
  • రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారనే ధీమా వ్యక్తం చేసిన అనిల్

అనిల్ రావిపూడి సినిమాలను పరిశీలిస్తే ఆయనకి కామెడీపై మంచి పట్టు ఉందనే విషయం వెంటనే అర్థమైపోతుంది. 'ఎఫ్ 2' సీక్వెల్ గా ఆయన చేసిన 'ఎఫ్ 3' పూర్తిస్థాయి కామెడీ ఇతివృత్తంగా కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. 
 
తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. 'ఎఫ్ 2' ను మించి కామెడీ ఉండాలనే ఉద్దేశంతోనే  'ఎఫ్ 3'లో వెంకటేశ్ కి 'రేచీకటి' .. వరుణ్ తేజ్ కి 'నత్తి' పెట్టడం జరిగింది. చీకటిపడగానే తెరపై వెంకటేశ్ చేసే హడావిడి చూసితీరవలసిందే. ఇక వరుణ్ తన మేనరిజం సినిమా మొత్తంలో 30 చోట్ల వాడవలసి వచ్చింది. 

నాకు తెలిసి ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు .. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ అనిపించదు. 'ఎఫ్ 3'లో మూడో హీరోను పెడదామని అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఇందులో కావలసినంత ఫన్ వచ్చేసింది కనుక ఆ పాత్రను పక్కన పెట్టాం. 'ఎఫ్ 4'లో మాత్రం కచ్చితంగా మూడో హీరోను రంగంలోకి దింపడం జరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు.

Venkatesh Daggubati
Varun Tej
Anil Ravipudi
F3 Movie
  • Loading...

More Telugu News