Rohit Sharma: భార్యతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ

Rohit Sharma enjoying with his wife in Maldives
  • ఐపీఎల్ లో విఫలమైన రోహిత్ శర్మ
  • ఫెయిల్యూర్ మూడ్ నుంచి బయటపడేందుకు భార్యతో మాల్దీవులకు వెళ్లిన వైనం
  • భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 14 ఇన్నింగ్స్ లో రోహిత్ 19.14 సగటుతో 268 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతని హయ్యెస్ట్ స్కోరు 48 పరుగులు మాత్రమే. అంతేకాదు, ఈ సీజన్ లో రోహిత్ జట్టు ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఆ ఫెయిల్యూర్ మూడ్ నుంచి బయటపడేందుకు రోహిత్ తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. ఓ బీచ్ రిసార్ట్ లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు... మరిన్ని రోజులు ఇలాంటి ఏకాంతం కావాలని క్యాప్షన్ ఇచ్చాడు. 

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. కోహ్లీ, బుమ్రాలతో పాటు రోహిత్ కు కూడా విశ్రాంతిని కల్పించారు. జూన్ చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ కు రోహిత్ మళ్లీ అందుబాటులోకి రానున్నాడు.
Rohit Sharma
Team India
Wife
Maldives

More Telugu News