Naga Chaitanya: పరశురామ్ అదే టైటిల్ ను ఖరారు చేశాడట!

Nagachaitanya in Parashuram Movie

  • తాజాగా 'సర్కారువారి పాట' చేసిన పరశురామ్ 
  • తరువాత సినిమా నాగచైతన్యతో 
  • టైటిల్ గా పరిశీలనలో 'నాగేశ్వరరావు'
  • యాక్షన్ డ్రామా జోనర్లో నడిచే కథ

మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలి .. తన వైపు నుంచి ఆయనకి ఒక హిట్ ఉండాలి అనే ఉద్దేశంతోనే తాను ఇండస్ట్రీకి వచ్చాననీ, తన కోరిక నెరవేరిందని 'సర్కారువారి పాట' స్టేజ్ పై పరశురామ్ చెప్పాడు. తన తదుపరి సినిమా నాగచైతన్యతో ఉందనే క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ సినిమాకి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. తన సినిమాకి టైటిల్ సెట్ చేసిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లే అలవాటు ఉందని చెప్పిన పరశురామ్, అదే విధంగా ముందుగా టైటిల్ సెట్ చేసి ఉంటాడని అనుకోవాలి.

త్వరలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి రంగంలోకి దిగిపోతారట. యాక్షన్ డ్రామా జోనర్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక .. పూజ హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. రష్మికను తీసుకునే అవకాశాలే ఎక్కువని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Naga Chaitanya
Rashmika Mandanna
Parashuram Movie
  • Loading...

More Telugu News