Anil Ravipudi: హీరో కావాలనే ఆశ లేదు .. అంత టెన్షన్ పడలేను: అనిల్ రావిపూడి

Anil Ravipudi Interview

  • 'ఎఫ్ 3' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి
  • నటనపై ఆసక్తి ఉందంటూ వ్యాఖ్య 
  • అయితే హీరో కావాలనే కోరిక లేదంటూ వివరణ
  • హీరోగా బరువు బాధ్యతలను మోయలేనంటూ స్పష్టీకరణ 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. 'పటాస్' నుంచి ఆయన ఇంతవరకూ ఫ్లాప్ అనే మాట వినలేదు. ఒక  సినిమాకి మించి మరో సినిమాను హిట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన 'ఆలీతో సరదాగా'లో సందడి చేశాడు. 

అనిల్ రావిపూడి అప్పుడప్పుడు కొన్ని స్టేజ్ లపై కామెడీ స్కిట్స్ చేస్తుంటాడు. అలాగే తన సినిమాలలో ఎక్కడో ఒక చోట కనిపించే ప్రయత్నాలు చేస్తుంటాడు. మంచి కనుముక్కు తీరుతో కుదురుగా కనిపిస్తాడు. అందువలన హీరో కావాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని అలీ అడిగాడు. 

అందుకు అనిల్ రావిపూడి స్పందిస్తూ .. "ఆర్టిస్టుగా చేయాలని ఉందిగానీ .. హీరోగా చేసేయాలనే ఆశ లేదు. హీరోగా చేయడమనేది పెద్ద బరువు .. చాలా పెద్ద బాధ్యత. మనపై సినిమాలు ఆడతాయా లేదా? .. ఫ్లాప్ వస్తే ఎట్లా? అనే టెన్షన్ నేను పడలేను. మామూలు ఆర్టిస్ట్ గా నైతే డైలీ పేమెంట్ ఇస్తారు .. టైమ్ టు టైమ్ పనిచేసి వచ్చేయవచ్చు" అంటూ చెప్పుకొచ్చాడు.

Anil Ravipudi
Sunil
Alitho Saradaga
  • Loading...

More Telugu News