Asaduddin Owaisi: ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ

Muslims contributed very much to our country says  Owaisi
  • మదరసాలను మూసివేయాలన్న అసోం సీఎం హిమంత
  • మదరసాల్లో గణితం, సైన్స్ అన్నీ బోధిస్తారన్న ఒవైసీ
  • రాజా రామ్మోహన్ రాయ్ కూడా మదరసాలోనే చదువుకున్నారని వ్యాఖ్య
మదరసాలను మూసివేయాలంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సంఘ్ పరివార్ లలో మాదిరి మదరసాల్లో విద్వేషాలను నేర్పించడం లేదని ఆయన అన్నారు. మదరసాల్లో ఆత్మగౌరవం, సానుభూతిని తెలియజేస్తారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో బ్రిటిషర్లను ముస్లింలు ఎదుర్కొన్నారని... ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిషర్లకు ఏజెంట్లుగా వ్యవహరించారని ఆరోపించారు.  

మదరసాల్లో గణితం, సైన్స్, సోషల్ అన్నీ బోధిస్తారని ఒవైసీ అన్నారు. హిందూ సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ చదువుకున్నది కూడా మదరసాలోనే అని చెప్పారు. ఆయన అక్కడ ఎందుకు చదువుకున్నారో సంఘ్ పరివార్ కు అర్థం కాదని అన్నారు. ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారని చెప్పారు.
Asaduddin Owaisi
Madarsas
BJP

More Telugu News