Muchharla Aruna: నల్లగా ఉన్నానని నన్ను అవమానించారు: సీనియర్ నటి ముచ్చర్ల అరుణ

Muchharla Aruna Interview

  • వివాహమైన తరువాత నటనకు దూరమైన అరుణ 
  • భగవంతుడు తనకు ఇచ్చిన రంగు నలుపని వ్యాఖ్య   
  • తనలాంటి వారు సినిమాల్లోకి రాకూడదేమోనని అనుకున్నానంటూ ఆవేదన

కథానాయికలు అందంగా ఉండాలనే ప్రేక్షకులు కోరుకుంటారు. అందువలన అందంగా ఉండేవారినే కథానాయికగా ఎంపిక చేస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో కాస్త నల్లగా ఉన్న కథానాయికలకి అవమానాలు ఎదురైనట్టుగా వారే చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ముచ్చర్ల అరుణ మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. 

"ఒక సినిమా షూటింగులో 'ఈ అమ్మాయి ఏంటి ఇంత నల్లగా ఉంది' అని నా ముందే అనుకున్నారు. నా పై షాట్ పెట్టడానికి ఆలోచన చేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆ తరువాత నేను ఒక సందర్భంలో జయప్రద గారిని చూశాను. ఆమె మల్లెపూవులా తెల్లగా  .. చాలా అందంగా కనిపించారు. 

నిజంగానే నేను చాలా  నల్లగా ఉన్నాను కదా .. నల్లగా ఉన్నవాళ్లు సినిమాల్లోకి రాకూడదేమో అనుకున్నాను. ఈ రోజుల్లో కూడా నాలా బాధపడేవాళ్లున్నారు. నల్లగా ఉన్నారని అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ ఇది భగవంతుడు ఇచ్చిన రంగు  .. మన చేతుల్లో ఏముంది?" అంటూ చెప్పుకొచ్చారు.

Muchharla Aruna
Sithakoka Chiluika Movie
Tollywood
  • Loading...

More Telugu News