Charan: చరణ్ కోసం స్పీడ్ పెంచుతున్న శంకర్!

Charan and Shankar movie update

  • శంకర్ ప్రాజెక్టులో బిజీగా ఉన్న చరణ్ 
  • వైజాగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న సినిమా
  • వచ్చేనెల 2వ వారం నుంచి మరో షెడ్యూల్ 
  • సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసే ఆలోచనలో శంకర్

చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమాను రూపొందుస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా కాగా, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానిని తీసుకున్నారు. 

ఈ సినిమా షూటింగు మొదలై కొంతకాలమవుతోంది. రంగంలోకి దిగుతూనే శంకర్ భారీ సీన్స్ ను చిత్రీకరించాడు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' .. 'ఆచార్య' ప్రమోషన్స్ లో చరణ్ పాల్గొనడం కోసం బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేసి ముఖ్యమైన  కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. రీసెంట్ గా వైజాగ్ షెడ్యూల్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. 

సాధారణంగా శంకర్ ఒక షెడ్యూల్ కీ .. మరో షెడ్యూల్ కి మధ్య గ్యాప్ తీసుకుంటాడు. కానీ ఈ సినిమా తరువాత వెంటనే తను 'ఇండియన్ 2' సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. అలాగే చరణ్ మరో ప్రాజెక్టు పైకి వెళ్లనున్నాడు. అందువలన చరణ్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను వచ్చే నెల 2వ వారం నుంచి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం కావడం వలన శంకర్ స్పీడ్ పెంచాడనే విషయం అర్థమైపోతూనే ఉంది.

Charan
Kiara Adwani
Shankar Movie
  • Loading...

More Telugu News