Delhi: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా నియామ‌కం

Vinai Kumar Saxena to be the Lt Governor of NCT Delhi

  • ఇటీవ‌లే రాజీనామా చేసిన అనిల్ బైజాల్‌
  • బైజాల్ స్థానంలో విన‌య్ కుమార్ స‌క్సేనా నియామ‌కం
  • రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం

ఢిల్లీ నూత‌న లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ అనుమ‌తితో కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొన్న‌టిదాకా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిన అనిల్ బైజాల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. 

బైజాల్ రాజీనామాతో ఖాళీ అయిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్నర్ ప‌ద‌విని విన‌య్ కుమార్ స‌క్సేనాతో కేంద్రం భ‌ర్తీ చేసింది. త్వర‌లోనే ఆయన ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌గా ఆయన ప‌నిచేస్తున్నారు.

Delhi
Vinai Kumar Saxena
Lt. Governor of NCT Delhi
Anil Baijal
Ram Nath Kovind
  • Loading...

More Telugu News