Kamal Haasan: కమల్ జోక్యం పై స్పందించిన 'విక్రమ్' డైరెక్టర్!

Vikram movie update

  • 'విక్రమ్' డైరెక్షన్లో కమల్ జోక్యమంటూ ప్రచారం
  • ఆ మాటలను ఖండించిన దర్శకుడు లోకేశ్ 
  • నటుడిగా తనకి కమల్ సహకరించారంటూ వ్యాఖ్య 
  • తన డైరెక్షన్లో కలగజేసుకోలేదని వివరణ

కమలహాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్ పై నిర్మితమైన సినిమా ఇది. ఈ సినిమాలో కమల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.

దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ సత్తాను చాటిచెప్పే సినిమాలుగా కార్తి 'ఖైదీ' .. 'విజయ్ 'మాస్టర్' కనిపిస్తాయి. అయితే 'విక్రమ్' సినిమాలో ఆయన మార్క్ కనిపించకపోవచ్చనీ, ఈ సినిమా విషయంలో కమల్ జోక్యం ఎక్కువనే ప్రచారం జోరందుకుంది. దర్శకుడిగా కమల్ కి ఉన్న అనుభవం గురించి తెలిసిందే. 

 తాజాగా ఈ విషయంపై లోకేశ్ స్పందిస్తూ .. 'విక్రమ్' సినిమా విషయంలో కమల్ ఎంతమాత్రం జోక్యం చేసుకోలేదు. ఒక నటుడిగానే ఆయన సహకరించారు తప్ప, దర్శకత్వంలో ఉన్న అనుభవం కారణంగా నా పనిలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయలేదు. దర్శకుడిగా ఆయన నాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు' అని చెప్పుకొచ్చారు. జూన్ 3వ తేదీన ఈ  సినిమా విడుదలవుతోంది.

Kamal Haasan
Vijay Sethupathi
Naren
Vikram Movie
  • Loading...

More Telugu News