TDP: మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు!... వైసీపీ విజ‌యంపై కొల్లు ర‌వీంద్ర ట్వీట్‌!

tdp leader kollu ravindra satires on ysrcp 2019 victory

  • 'ఒక్క ఛాన్స్ మీ చివ‌రి ఛాన్స్‌' అన్న కొల్లు   
  • శేష జీవితాన్ని ఈ రెండేళ్ల‌లో చూస్కోండి అంటూ సెటైర్ 
  • వ‌చ్చే ఎన్నిక‌లు వైసీపీకి స‌మాధేనంటూ వ్యాఖ్యలు 

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ద‌క్కిన విజ‌యానికి మూడేళ్లు పూర్తి అయిన నేప‌థ్యంలో వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటూ ఉంటే... ఆ విజ‌యంపై విప‌క్ష టీడీపీ సెటైర్లు సంధించింది. ఇందులో భాగంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వైసీపీ విజ‌యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు అంటూ ఆయ‌న సెటైర్ సంధించారు.

ఒక్క ఛాన్స్ మీ చివ‌రి ఛాన్స్ కాబోతుంది అంటూ కొల్లు ర‌వీంద్ర త‌న ట్వీట్‌లో వైసీపీని హెచ్చ‌రించారు. మూడేళ్లు అయ్యాయి అని వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే.. ఎంత తొందరగా ఈ పీడ పోతుందో అని ప్రజలు వేచి చూస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. మీ శేష జీవితం ఎలా బతకాలో ఈ రెండేళ్లలో చూస్కోండి అంటూ వైసీపీ నేత‌ల‌కు సూచించిన కొల్లు... ఈ ఎన్నికలు మీ పార్టీకి, మీకు సమాధి కాబోతున్నాయంటూ హెచ్చ‌రించారు.

TDP
Kollu Ravindra
YSRCP
Andhra Pradesh
2019 Elections
2024 Elections

More Telugu News