Junior NTR: కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ రఫ్ లుక్!

Ntr in Koratala movie

  • కొరటాల సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్
  • ఫైనల్ గా స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
  • పాత్ర కోసం బరువు తగ్గుతున్న ఎన్టీఆర్ 
  • జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన

ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు  జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగు ఒకసారి మొదలైతే చకచకా సాగిపోయేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ షూటింగును జులై 2వ వారం నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. 

ఈ కథలో పొలిటికల్ టచ్ ఉంటుందని అంటున్నారు. అలాగే కొరటాల మార్క్ సందేశం కూడా ఉంటుందని చెబుతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్, ఈ సినిమా కోసం బరువు తగ్గనున్నాడని అంటున్నారు. ఒక వైపున ఆయన అందుకు సంబంధించిన కసరత్తులు చేస్తుంటే, స్క్రిప్ట్ కి కొరటాల తుది మెరుగులు దిద్దుతున్నాడట.

 గతంలో 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ ను రఫ్ లుక్ తో చూపించిన కొరటాల, అదే తరహాలో ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ ను రఫ్ లుక్ తోనే చూపించనున్నాడని సమాచారం. ఎమోషన్ తో ముడిపడిన యాక్షన్ తో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Junior NTR
Koratala Siva
Tollywood
  • Loading...

More Telugu News