exams: 5 నిమిషాలు ఆల‌స్య‌మైనా అనుమ‌తి.. తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు షురూ

tenth exams in ts

  • పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి విద్యార్థుల‌కు అనుమతి
  • ఈ సారి ఆరు పేప‌ర్ల‌తో ప‌రీక్ష‌లు 
  • నెల రోజుల్లోగా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు

తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఐదు నిమిషాలు ఆల‌స్య‌మైనా విద్యార్థుల‌ను ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి విద్యార్థుల‌ను అనుమతించారు. ఈ సారి ఆరు పేప‌ర్ల‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. నెల రోజుల్లోగా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. 

కరోనా కారణంగా రెండేళ్ల‌ తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ‌లో 2,861 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ‌హిస్తుండ‌గా, 5,08,110 మంది రెగ్యులర్‌, 1,165 మంది ప్రైవేట్ విద్యార్థుల‌తో కలిపి మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. కాగా, పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News