Narendra Modi: జ‌పాన్‌లో 'మోదీ మోదీ' అంటూ నినాదాలు.. ప్ర‌ధానికి ఘ‌నస్వాగ‌తం

modi reaches japan

  • జపాన్ లో క్వాడ్ దేశాల సదస్సు
  • టోక్యోలోని హోట‌ల్ లో మోదీ బ‌స‌
  • ప్ర‌వాసుల‌తో మోదీ ముచ్చ‌ట‌  

జ‌పాన్ లో రేపు జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు భార‌త ప్ర‌ధాని మోదీ ఆ దేశానికి బ‌య‌లుదేరిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం టోక్యో చేరుకున్న‌ మోదీకి ప్రవాస భారతీయులు ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి హోటల్ న్యూ ఒటానీలో మోదీ బస చేస్తున్నారు. 

అక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు ‘మోదీ మోదీ’, ‘ వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. భార‌త జాతీయ జెండాలు ఊపుతూ మోదీకి స్వాగతం పలికారు. వారితో కాసేపు మోదీ ముచ్చ‌టించారు. చిన్నారులతోనూ మోదీ మాట్లాడారు. వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను చిన్నారులు పట్టుకుని మోదీకి స్వాగ‌తం ప‌లికారు.

Narendra Modi
BJP
Japan
  • Loading...

More Telugu News