Anantababu: ఎమ్మెల్సీ అనంతబాబు ఓ పెళ్లికి కూడా హాజరయ్యారు.. తప్పుచేయలేదన్న ధైర్యంతోనే తిరుగుతున్నారు: బొత్స

Botsa satyanarayana responds aobut YCP MLC Anantababu

  • మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై ఆరోపణలు
  • ఘటన తర్వాతి నుంచి అదృశ్యం
  • వాంగ్మూలం విషయంలో బాధితుడి తల్లి, భార్య నిర్లక్ష్యం చేశారని బొత్స మండిపాటు
  • లేదంటే ఈపాటికే అరెస్ట్ అయి ఉండేవారన్న మంత్రి

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) విషయమై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన ఎక్కడో వివాహానికి హాజరైనట్టు తాను మీడియాలో చూశానని పేర్కొన్నారు. ఆయన ఏ తప్పు చేసి ఉండకపోవచ్చని, ఆ ధైర్యంతోనే ఆయన అలా తిరుగుతుండొచ్చని అన్నారు. 

అనంతబాబుపై తాము కేసు నమోదు చేశామని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఆయన తల్లి, భార్య వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్టై ఉండేవారని అన్నారు. ఈ విషయంలో వారు రెండు రోజులపాటు నిర్లక్ష్యం చేశారని మంత్రి బొత్స విమర్శించారు.

ఈ నెల 26 నుంచి జరగనున్న బస్సు యాత్రపై చర్చించేందుకు శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో నిన్న సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Anantababu
YSRCP
Ananta Satya Udaya Bhaskar
Veedhi Subramanyam
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News