Uttar Pradesh: ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాలోని అజయ్ దేవగణ్‌ను అనుసరించి కటకటాలపాలైన యువకుడు.. వీడియో ఇదిగో!

Ajay Devgn like car stunt lands youth in jail
  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘటన
  • రెండుకార్లు, రెండు బైక్‌లు స్వాధీనం
  • యువకుడిపై న్యూసెన్స్ కేసు నమోదు
ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి లైకులు సంపాదించడం చాలా సాధారణ విషయంగా మారింది. స్టంట్స్ చేసేటప్పుడు ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రాజీవ్ (21) ఇలాంటి స్టంటే చేసి కటకటాలపాలయ్యాడు.

రెండు కార్లపై అటో కాలు, ఇటో కాలు వేసి నిల్చుని, ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాలో అజయ్ దేవగణ్‌‌ చేసినట్టుగా చేశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అతడిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్టంట్స్ కోసం రాజీవ్ వినియోగించిన రెండు ఎస్‌యూవీ కార్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Uttar Pradesh
Noida
Ajay Devgn
Car Stunt

More Telugu News