SRH: పంజాబ్ పై ఓ మోస్తరు స్కోరు సాధించిన సన్ రైజర్స్

SRH set Punjab Kings 158 runs target

  • వాంఖెడే స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు
  • 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ
  • చెరో 3 వికెట్లు తీసిన హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 43, రొమారియా షెపర్డ్ 26 (నాటౌట్), వాషింగ్టన్ సుందర్ 25, అయిడెన్ మార్ క్రమ్ 21, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు సాధించారు. 

ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (4), నికోలాస్ పూరన్ (5) విఫలమయ్యారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కట్టడి చేశారు. కగిసో రబాడాకు ఓ వికెట్ దక్కింది.

SRH
Batting
Punjab Kings
IPL
  • Loading...

More Telugu News