SRH: నేటితో ముగియనున్న ఐపీఎల్ లీగ్ దశ... పంజాబ్ పై టాస్ గెలిచిన సన్ రైజర్స్
- ఆఖరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్ తో పంజాబ్ ఢీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
- స్వదేశానికి వెళ్లిపోయిన కేన్ విలియమ్సన్
- సన్ రైజర్స్ కెప్టెన్ గా భువనేశ్వర్
గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ లో నేటితో లీగ్ దశ ముగియనుంది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ అప్రాధాన్యంగా మారింది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా, కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో సన్ రైజర్స్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తన భార్య సారా రహీం త్వరలోనే ప్రసవించనున్న నేపథ్యంలో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలు భువీకి అప్పగించారు.
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో రెండు మార్పులు చేశారు. రొమారియో షెపర్డ్, జగదీశ సుచిత్ జట్టులోకి వచ్చారు. అటు, పంజాబ్ కింగ్స్ జట్టులో మూడు మార్పులు చేసినట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు. నాథన్ ఎల్లిస్, షారుఖ్ ఖాన్, ప్రేరక్ మన్కడ్ జట్టులోకి వచ్చారని తెలిపాడు.