Mahesh Babu: నన్ను తిట్టడానికి కీర్తి సురేశ్ తెగ భయపడిపోయింది: మహేశ్ బాబు

Sarkaruvari Paata Unfiltered Convo

  • అభిమానులతో ఇంటరాక్షన్ లో మహేశ్ అండ్ టీమ్ 
  • కీర్తి సురేశ్ తనని తిట్టే సీన్ గురించి ప్రస్తావించిన మహేశ్
  • తనని తిట్టడానికి ఆమె ఇబ్బంది పడిందంటూ వ్యాఖ్య 
  • అడిగిమరీ తిట్టించుకున్నానంటూ నవ్వులు  

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో నిర్మితమైన 'సర్కారువారి పాట' 200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అభిమానులతో ఇంటరాక్షన్ ను నిర్వహించింది. మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ .. పరశురామ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానూలు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. 

మహేశ్ బాబు మాట్లాడుతూ  .. "ఈ సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్పాలి. ఒక సీన్లో నా ముఖంపై తిట్టమని కీర్తి సురేశ్ తో పరశురామ్ చెప్పాడు. మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు బాబోయ్ అనేసింది. మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ ఊరుకోరు అంటూ భయపడిపోయింది. 

నా ఫ్యాన్స్ ఏమీ అనరు .. ఇలాంటి సీన్స్ ను వాళ్లు ఎంజాయ్ చేస్తారు .. నిన్ను మరింత లవ్ చేస్తారు .. ఫరవాలేదు చేసేయండి అన్నాను. అంతగా అడిగితే గానీ ఆమె నన్ను తిట్టలేదు .. ఆ సీన్ చిన్నపాటి స్ట్రీట్ ఫైట్ లా ఉండాలని పరశురామ్ చెప్పాడు. ఇప్పుడు ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.

Mahesh Babu
Keerthi Suresh
Sarkaaruvaari Paata Movie
  • Loading...

More Telugu News