India: ఇండియాలో కొత్తగా 2,323 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

2323 new cases recorded in India

  • గత 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 2,346
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,996
  • మొత్తం మృతుల సంఖ్య 5,24,348 

దేశంలో కరోనా తీవ్రత పూర్తి నియంత్రణలోనే ఉంది. రోజువారీ కేసులు కొంచెం అటూఇటుగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి ఆందోళనకర స్థాయిలో లేకపోవడం ఊరటను కలిగిస్తోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,323 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఇదే సమయంలో 2,346 మంది కరోనా నుంచి కోలుకోగా.. 25 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 14,996 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేరళలో అత్యధికంగా 556 కేసులు వచ్చాయి. ఢిల్లీలో 530, మహారాష్ట్రలో 311, హర్యానాలో 262, ఉత్తరప్రదేశ్ లో 146 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,31,34,145కి చేరుకుంది. మొత్తం 4,25,94,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,24,348కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,92,12,96,720 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15,32,383 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

India
Corona Virus
Updates
  • Loading...

More Telugu News