Nithi: ఇటలీలో నితిన్ భలే ప్లాన్ చేశాడే!

Nithin in Vakkantham Vamsi Movie Update

  • నితిన్, కృతిశెట్టి జంటగా 'మాచర్ల నియోజకవర్గం'
  • దర్శకత్వం వహిస్తున్న రాజశేఖర్ రెడ్డి   
  • ఇటలీలో జరుగుతున్న పాటల షూటింగ్ 
  • శ్రీలీలతో అక్కడికి వెళ్లిన వక్కంతం వంశీ 
  • ఆ సినిమా పాటలను కూడా అక్కడే కానిచ్చేసిన నితిన్

నితిన్ హీరోగా ఆయన తాజా చిత్రమైన 'మాచర్ల నియోజకవర్గం' రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ టచ్ తో నడిచే డ్రామా ఇది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది.

ఈ సినిమాకి సంబధించిన 3 పాటలను చిత్రీకరించడానికి ఈ సినిమా టీమ్ ఇటలీ వెళ్లింది. అక్కడ పాటకి .. పాటకి మధ్య గ్యాప్ ఉండటంతో సమయాన్ని వృథా చేయకూడదని భావించిన నితిన్, తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ వక్కంతం వంశీని .. హీరోయిన్ శ్రీ లీలను ఇటలీకి రప్పించాడట.  వీళ్లతో పాటు కెమెరామెన్ .. కొరియోగ్రాఫర్ కూడా వెళ్లారట.

 నితిన్ -  శ్రీలీలపై ఒకటి రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒకే యూనిట్ తో రెండు సినిమాల పాటలను నితిన్ కవర్ చేశాడన్న మాట. ఖర్చు కలిసి రావడం కోసం నితిన్ భలే ప్లాన్ చేశాడే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది కూడా ఆయన బ్యానర్లోని సినిమానే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

Nithi
Krithi Shetty
Sreeleela
  • Loading...

More Telugu News