Qutb Minar: కుతుబ్ మినార్ ను కట్టించింది రాజా విక్రమాదిత్య!: తెరపైకి కొత్త వాదనను తెచ్చిన పురావస్తు శాఖ మాజీ అధికారి

Qutb Minar was built by Raja Vikramaditya to observe the sun Ex  ASI officers big claim

  • 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య కట్టించినదన్న పురావస్తు శాఖ మాజీ అధికారి ధరమ్ వీర్ శర్మ 
  • సూర్యుడి గమనాన్ని అధ్యయనం చేసేందుకని వెల్లడి
  • ఇది సైన్స్.. పురాతన వాస్తవం అంటున్న శర్మ 

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కు సంబంధించి కొత్త వాదన తెరపైకి వచ్చింది. అరుదైన ఈ పురాతన కట్టడాన్ని కట్టించింది రాజా విక్రమాదిత్య అంటూ పురావస్తు పరిశోధన శాఖ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ ప్రకటన చేశారు. దీన్ని కట్టించింది కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ కాదన్నది ఆయన వాదన. సూర్యుడి గమనాన్ని అధ్యయనం చేసేందుకు రాజు విక్రమాదిత్య దీన్ని కట్టించినట్టు ఆయన చెబుతున్నారు. 

‘‘ఇది కుతుబ్ మినార్ కాదు. సన్ టవర్ (పరిశీలించే గోపురం). 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య దీన్ని కట్టించాడు. కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ కాదు. ఇందుకు సంబంధించి నా వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అని ధరమ్ వీర్ శర్మ ప్రకటన చేశారు. పురావస్తు శాఖ తరఫున శర్మ కుతుబ్ మినార్ ను ఎన్నో పర్యాయాలు సర్వే చేయడం గమనార్హం.

‘‘కుతుబ్ మినార్ టవర్ లో 25 అంగుళాల వంపు ఉంటుంది. ఎందుకంటే సూర్యుడిని పరిశీలించేందుకు ఇలా నిర్మించారు. అందుకే జూన్ 21న సూర్య ఆయనంలో (ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి మారే క్రమం) కనీసం అరగంట పాటు ఆ ప్రాంతంపై నీడ పడదు. ఇది సైన్స్. పురాతన వాస్తవం’’ అని తన వాదనకు నేపథ్యాన్ని శర్మ వివరించారు.

కుతుబ్ మినార్ అన్నది స్వతంత్ర కట్టడమని, సమీపంలోని మసీదుకు సంబంధించినది కాదని శర్మ పేర్కొన్నారు. కుతుబ్ మినార్ డోర్ కూడా ఉత్తర ముఖంగా ఉంటుందని, రాత్రి వేళ ధ్రువ నక్షత్రాన్ని చూసేందుకేనన్నారు.

  • Loading...

More Telugu News