Kamal Haasan: 'విక్రమ్' సినిమాలో భాగమైన సూర్య!

Vikram movie update

  • కమల్ సొంత బ్యానర్లో రూపొందుతున్న 'విక్రమ్'
  • కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఫహాద్ .. విజయ్ సేతుపతి
  • అతిథి పాత్రలో కనిపించనున్న సూర్య
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

కమల్ కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సూర్య కూడా అతిథి పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి.

అది నిజమేనన్నట్టుగా సూర్యతో కలిసి దిగిన ఒక ఫొటోను లోకేశ్ కనగరాజ్ పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో సూర్య కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. దాంతో ఈ సినిమాలో సూర్య చేస్తున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆయన పాత్ర ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

కమల్ తో పాటు సమానమైన పాత్రలను ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ సినిమాపై ఆసక్తిని .. అంచనాలను పెంచుతున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వివిధ భాషల్లో త్వరలోనే ఈ సినిమా థియేటర్లకు రానుంది..

More Telugu News