Telangana: తెలంగాణ‌లో పెరిగిన‌ మ‌ద్యం ధ‌ర‌లు... దేనిపై ఎంత అంటే..!

liquor rates hiked in telangana

  • బీరుపై రూ.20 పెంపు
  • క్వార్ట‌ర్ బాటిల్‌పై రూ.20 పెంపు
  • రూ.80 పెరిగిన మ‌ద్యం ఫుల్ బాటిల్ ధ‌ర‌
  • రేప‌టి నుంచే అమ‌ల్లోకి పెంచిన ధ‌ర‌లు

తెలంగాణ‌లో మ‌ద్యం ధ‌ర‌లు పెరిగాయి. ఒక్కో బీరుపై రూ.20 పెంచిన ప్రభుత్వం...బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్ట‌ర్‌పై రూ.20 పెంచింది. ఇక బ్రాండ్‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ మ‌ద్యం ధ‌ర‌ను ఏకంగా రూ.80 పెంచింది. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

పెంచిన ధ‌ర‌లు రేప‌టి (మే 19) నుంచే అమ‌ల్లోకి రానున్నాయి. మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచిన నేప‌థ్యంలో నేటి రాత్రి మ‌ద్యం విక్ర‌యాల గ‌డువు ముగియ‌గానే... ఆయా దుకాణాల్లోని మ‌ద్యంను అధికారులు సీజ్ చేయ‌నున్నారు. ఆపై గురువారం నుంచి పెరిగిన మ‌ద్యం రేట్ల‌ను అమ‌లులోకి తీసుకువస్తారు.

Telangana
LIquor Rates
TS Excise Department
  • Loading...

More Telugu News