Vishwak Sen: విష్వక్సేన్ జోడీగా అర్జున్ కూతురు!

Aishwarya  Arjun in  Telugu Movie

  • కోలీవుడ్ కి కూతురిని హీరోయిన్ గా పరిచయం చేసిన అర్జున్
  • అక్కడ అంతగా రాణించని ఐశ్వర్య 
  • కన్నడలోను తండ్రి దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చిన భామ 
  • టాలీవుడ్లో ఆమెను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అర్జున్

కోలీవుడ్లో కమలహాసన్ .. శరత్ కుమార్ ఫ్యామిలీస్ నుంచి హీరోయిన్స్ వచ్చారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కథానాయికగా పరిచయమైంది. తమిళ .. కన్నడ భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసింది. లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఇక వరుస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు.

కానీ ఆ తరువాత ఆమె తమిళంలోగానీ .. కన్నడలో గాని మళ్లీ తెరపై కనిపించలేదు. కన్నడలో తన సొంత బ్యానర్లో .. సొంత డైరెక్షన్లో ఐశ్వర్యను పరిచయం చేసిన అర్జున్, తెలుగులోను అదే తరహాలో ఆమెను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని చెబుతున్నారు.  

అర్జున్ కి కథా కథనాలపై మంచి పట్టు ఉంది. అదే విధంగా దర్శక నిర్మాతగాను అనుభవం ఉంది. అందువలన ఆయన తన కథకి తగిన హీరోగా విష్వక్సేన్ ను ఎంచుకున్నాడని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. రీసెంట్ గా విష్వక్ 'అశోకవనంలో అర్జున కల్యాణం'తో సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

Vishwak Sen
Arjun Movie
Aishwarya Arjun
  • Loading...

More Telugu News