Hardik Patel: కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి హార్దిక్ పటేల్ రాజీనామా

Hardik Patel resigns from party months before polls

  • హార్దిక్ పటేల్ బీజేపీలో చేరే అవ‌కాశం
  • ట్విట్ట‌ర్‌లో ఓ లేఖ పోస్ట్ చేసిన ప‌టీదార్ నేత‌
  • గుజ‌రాత్ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌

గుజ‌రాత్ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌ త‌గిలింది. అంద‌రూ ఊహించిన‌ట్లే ప‌టీదార్ నేత‌, రాష్ట్ర కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఆ పార్టీ పదవికి, ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదంటూ ఆయ‌న ఇటీవల వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఈ నెల 15న హార్దిక్ ప‌టేల్ ఇత‌ర ప‌టీదార్ నేత‌లు అల్పేశ్ ఖ‌తిరియా, దినేశ్ బాంభానియాతో క‌లిసి బీజేపీ నేత‌, గుజ‌రాత్ మంత్రి న‌రేశ్ ప‌టేల్‌ను క‌లిశారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు కొన్ని నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌టీదార్ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న హార్దిక్ ప‌టేల్ రాజీనామా చేయ‌డంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలిన‌ట్లే. త‌న‌ భవిష్యత్ కార్యాచరణను త్వ‌ర‌లోనే ప్రకటించనున్నట్టు హార్దిక్ పటేల్ ఇటీవ‌లే తెలిపారు.

Hardik Patel
Congress
BJP

More Telugu News