Venkatesh: లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా .. 'ఎఫ్ 3' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

F3 Movie lyrical song released

  • 'ఎఫ్ 2' సీక్వెల్ గా వస్తున్న 'ఎఫ్ 3'
  •  తాజాగా పూజ హెగ్డే లిరికల్ సాంగ్ రిలీజ్
  • దేవిశ్రీ మేజిక్ కనిపించని సాంగ్
  • ఈ నెల 27వ తేదీన సినిమా విడుదల

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 3 ' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా .. వరుణ్ జోడీగా మెహ్రీన్ అలరించనున్నారు. ఒక ముఖ్యమైన పాత్రలో సోనాల్ చౌహాన్ అందాలు ఒలకబోయగా, స్పెషల్ సాంగ్ లో పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది.  

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పూజ హెగ్డే .. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

'లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా .. ' అంటూ ఈ పాట సాగుతోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రాహుల్ సిప్లి గంజ్ .. గీతామాధురి ఆలపించారు. ఈ పాటకి రాజు సుందరం కొరియో గ్రఫీని అందించాడు. సరదాగా సాగే పార్టీ సాంగే అయినప్పటికీ, సాహిత్యపరమైన ఛమక్కు .. దేవిశ్రీ మేజిక్ మిస్సయినట్టుగా అనిపిస్తోంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

Venkatesh
Varun Tej
Anil Ravipudi
F3 Movie

More Telugu News