Sai Pallavi: ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి.. వీడియో ఇదిగో!

Sai Pallavi watches Sarkaru Vaari Paata

  • 'సర్కారువారి పాట' సినిమా చూసిన సాయిపల్లవి
  • ముసుగు వేసుకుని, ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

పబ్లిక్ లోకి రావడానికి సెలబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడతారు. ఎవరి కంటైనా పడితే చాలు జనాలు వారిని చుట్టుముట్టేస్తారు. అందుకే వారు జీవితం చాలా ప్రైవేట్ గా మారిపోతుంది. తాజాగా ఇలాంటిదే మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఒక సినిమా చూడటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' చిత్రం మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూడటానికి సాయిపల్లవి ముసుగు వేసుకుని, ఎవరి కంటా పడకుండా వెళ్లొచ్చింది. మాస్క్ ధరించి, ఫోన్ మాట్లాడుతూ, ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాదులోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Sai Pallavi
Sarkaru Vaari Paata
Movie
Tollywood

More Telugu News