India: భారత్ లో అదుపులో ఉన్న కరోనా.. అప్డేట్స్ ఇవిగో!

Corona is in control in India

  • గత 24 గంటల్లో 2,202 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,550
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,317

దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. గత 24 గంటల్లో 2.97 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించగా 2,202 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,550 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 17,317 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 5,24,241 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 4,25,82,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక భారత్ లో ఇంతవరకు 1,91,37,34,314 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

India
Corona Virus
Updates
  • Loading...

More Telugu News