Vijay Devarakonda: సమంత .. విజయ్ దేవరకొండ మూవీ 'ఖుషి' ఫస్టులుక్ మోషన్ పోస్టర్ రిలీజ్!

Khushi Movie  Update

  • 'మజిలీ' తరువాత శివ నిర్వాణ నుంచి మరో ప్రేమకథ
  • ఆయన దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమాగా 'ఖుషి'
  • తొలిసారిగా విజయ్ దేవరకొండతో జత కట్టిన సమంత 
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న మోషన్  పోస్టర్ 
  • డిసెంబర్ 23వ తేదీన సినిమా విడుదల

సమంత ఈ మధ్య కాలంలో వరుసగా నాయిక ప్రధానమైన సినిమాలను చేస్తూ వెళుతోంది. 'మజిలీ' తరువాత ఆమె మరో ప్రేమకథా చిత్రం చేయడానికి అంగీకరించింది .. అది కూడా 'మజిలీ' సినిమా దర్శకుడితోనే కావడం విశేషం. దర్శకుడు శివ నిర్వాణ మైత్రీ బ్యానర్ తో కలిసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. 

విజయ్ దేవరకొండ - సమంత జోడీ అనేసరికి సహజంగానే అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాకి 'ఖుషి' అనే టైటిల్ ను ఖరారు చేయడంతో అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండ మోడ్రన్ లుక్ తో కనిపిస్తుంటే, సమంత సంప్రదాయ బద్ధమైన లుక్ తో కనిపిస్తోంది.

ఈ ఇద్దరికీ కొంగుముడి వేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పుడే ప్రకటించడం విశేషం. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 'యశోద' తరువాత సమంత .. 'లైగర్' తరువాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఇది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Vijay Devarakonda
Samantha
Khushi Movie

More Telugu News