Thomas Cup: థామ‌స్ క‌ప్ విజేత‌గా భార‌త్‌!

india is thomas cup champion

  • స్వ‌ర్ణం గెలిచిన భార‌త్‌
  • ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో భార‌త్ ఆట‌గాళ్ల గెలుపు
  • స‌త్తా చాటిన శ్రీకాంత్‌, ప్ర‌ణ‌య్‌, ల‌క్ష్య‌సేన్‌

భార‌త బ్యాడ్మింట‌న్ చ‌రిత్ర‌లో ఆదివారం ఓ సువ‌ర్ణ అధ్యాయం లిఖిత‌మైంది. థామ‌స్ క‌ప్ విజేత‌గా భార‌త్ నిలిచింది. ఫైన‌ల్‌లో భార‌త ష‌ట్ల‌ర్లు స‌త్తా చాటి... ఐదు మ్యాచ్‌ల‌కు గాను మూడింటిలో విజ‌యం సాధించ‌డంతో థామ‌స్ క‌ప్ భార‌త వ‌శ‌మైంది. ఫైన‌ల్‌లో భార‌త ష‌ట్ల‌ర్లు... ఇండోనేషియా ఆట‌గాళ్ల‌ను చిత్తు చేశారు. 14 సార్లు విజేత‌గా నిలిచిన ఇండోనేషియాను ఈ ద‌ఫా భార‌త్ చిత్తు చేసింది. 

ఫైన‌ల్‌లో భార‌త్‌కు చెందిన శ్రీకాంత్‌, ప్ర‌ణ‌య్‌, ల‌క్ష్య‌సేన్ స‌త్తా చాటారు. ఇరు దేశాల ఆట‌గాళ్ల మ‌ధ్య టైటిల్ కోసం ఐదు మ్యాచ్‌లు నిర్వ‌హించ‌గా..వాటిలో భార‌త్ మూడింటిలో విజ‌యం సాధించింది. ఫ‌లితంగా థామ‌స్ క‌ప్ విజేత‌గా నిలిచి స్వ‌ర్ణం గెలుచుకుంది.

Thomas Cup
India
KIdambi Shrikanth
Pranay
Lakshya Sen

More Telugu News