Junior NTR: ఎన్టీఆర్ .. శంకర్ లను కలిపిన చరణ్?

Ntr in Shankar Movie

  • చరణ్ తో సినిమా చేస్తున్న శంకర్ 
  • ఆల్రెడీ కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా 
  • ఎన్టీఆర్ కోసం లైన్ రెడీ చేసినట్టు చరణ్ తో చెప్పిన శంకర్ 
  • ఇద్దరి మధ్య చర్చలు జరిగేలా చూసిన చరణ్ 
  • శంకర్ లైన్ కి ఓకే చెప్పిన ఎన్టీఆర్ 

ఎన్టీఆర్ .. చరణ్ కలిసి చేసిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా ఒక సంచలనమే సృష్టించింది. ఆ తరువాత  కొరటాల .. ప్రశాంత్ నీల్ .. బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నాడు. ఇక చరణ్ మాత్రం శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

ఈ సినిమా సమయంలోనే శంకర్ తన దగ్గర ఒక లైన్ ఉందంటూ చరణ్ కి వినిపించాడట. ఈ కథకి ఎన్టీఆర్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఆ లైన్ విన్న చరణ్ కూడా అదే ఫీల్ అయ్యాడని అంటున్నారు. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఎన్టీఆర్ కి విషయం చెప్పి శంకర్ ను కలిపాడట.

శంకర్ చెప్పిన లైన్ పట్ల ఎన్టీఆర్ ఆసక్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో పూర్తి కథను శంకర్ వినిపించవలసి ఉంటుంది. అయితే ఆయన చేతిలో 'ఇండియన్ 2' .. ' అపరిచితుడు' హిందీ రీమేక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాల తరువాతనే ఎన్టీఆర్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.

Junior NTR
Ramcharan
Shankar Movie
  • Loading...

More Telugu News