Praja Shanti Party: కాంగ్రెస్ పార్టీ పనైపోయింది.. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది మేమే: కేఏ పాల్

we replace congress party place says KA Paul

  • ఒక్క హైదరాబాద్ మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలు తమవేనన్న పాల్
  •  దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టీకరణ
  • పవనే తమ వెంట పడుతున్నారని షా చెప్పారన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్

దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది తామేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంకు లేదని అమిత్ షాతో భేటీ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఓటు బ్యాంకు లేని పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్ షాను ప్రశ్నించినట్టు చెప్పారు. దానికి మంత్రి మాట్లాడుతూ.. తాము ఆయన వెంట పడలేదని, ఆయనే తమ వెంట పడుతున్నారని చెప్పారని పాల్ అన్నారు.

Praja Shanti Party
KA Paul
Amit Shah
Pawan Kalyan
  • Loading...

More Telugu News