Bihar DGP: సహారా చీఫ్ సుబ్రతోరాయ్‌ను హాజరుపరచండి!.. బీహార్ డీజీపీకి పాట్నా హైకోర్టు ఆదేశం!
![Patna HC directs Bihar DGP to produce Sahara chief Subrata Roy physically before court](https://imgd.ap7am.com/thumbnail/cr-20220513tn627e591a19bc1.jpg)
- సహారా పరివార్‌పై కేసు విచారణ
- మే 16న సుబ్రతో రాయ్‌ను హాజరుపరచాలన్న హైకోర్టు
- యూపీ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ల సహకారం తీసుకోవాలని సూచన
సహారా ఇండియా పరివార్‌పై నమోదైన కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా పాట్నా హైకోర్టు శుక్రవారం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సహారా పరివార్ చీఫ్ సుబ్రతోరాయ్‌ను తమ ముందు హాజరు పరచాలంటూ హైకోర్టు బీహార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు సుబ్రతో రాయ్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ల సహకారం తీసుకోవాలని కూడా బీహార్ డీజీపీని కోర్టు ఆదేశించింది.