Etela Rajender: కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయింది: ఈటల రాజేందర్

Etela Rajender fires on KCR

  • ఓ రాజ్యాన్ని పాలిస్తున్నట్టుగా కేసీఆర్ తీరు ఉందన్న ఈటల 
  • ప్రధాని గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శ 
  • కేసీఆర్ పాలనకు ముగింపు పలికేందుకే బండి సంజయ్ పాదయాత్ర అని వెల్లడి 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ పాలన సాగడం లేదని... ఓ రాజ్యాన్ని పాలిస్తున్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చడం లేదని ఈటల అన్నారు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందని... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ముగింపు పలికేందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. అమిత్ షా సభా ప్రాంగణాన్ని ఈరోజు ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Etela Rajender
Amit Shah
Bandi Sanjay
BJP
KCR
TRS
  • Loading...

More Telugu News