Adivi Sesh: ఆ సినిమాలో నుంచి నన్ను తీసేశారు: అడివి శేష్

Major movie update

  • అడివి శేష్ తాజా చిత్రంగా 'మేజర్'
  • సినిమా ప్రమోషన్లో గత అనుభవాలు పంచుకున్న శేష్ 
  • 'చందమామ' సినిమాలో నవదీప్ చేసిన పాత్రకు ముందు తనను బుక్ చేశారని వెల్లడి 
  • రెండు రోజుల షూట్ తరువాత తనను తీసేశారన్న శేష్     

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఒక వైపున రీమేకులు .. మరో వైపున బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. బయోపిక్ ల వరుసలో 'మేజర్' సినిమా కూడా ఉంది. 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 3వ తీదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో నెమ్మదిగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా  తన కెరియర్ ను గురించి అడివి శేష్ మాట్లాడుతూ .. " చాలా చిన్న చిన్న పాత్రలను చేస్తూ ఈ స్థాయి వరకూ వచ్చాను. 'చందమామ' సినిమాలో నవదీప్ చేసిన రోల్ నేను చేయవలసింది. రెండు రోజుల పాటు షూట్ చేసిన తరువాత నన్ను తీసేశారు. 

ఇక 'సొంతం' సినిమాలో చాలా పెద్ద రోల్ అని చెప్పి నాతో ఓకే అనిపించారు .. చేయించారు. తీరా చూస్తే తెరపై ఆ పాత్ర కొన్ని సెకన్లు మాత్రమే కనిపించింది. అలాంటి సంఘటనలను ఫేస్ చేస్తూ  ఇక్కడి వరకూ వచ్చాను. 'మేజర్' వంటి ఒక సినిమా చేయగలిగినందుకు గర్వపడుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Adivi Sesh
Saiee Man jrekar
Sobhitha Dhulipalla
Major Movie
  • Loading...

More Telugu News