Chennai Super Kings: చెన్నైకి చావోరేవో!... ముంబైతో నేడు కీల‌క మ్యాచ్‌!

csk key match with mi today at Wankhede Stadium

  • ప్లే ఆఫ్స్ నుంచి అవుటైన ముంబై
  • నేటి మ్యాచ్‌లో ఓడితే చెన్నై కూడా ఇంటికే
  • ముంబై కంటే చెన్నైకే కీల‌కంగా మారిన మ్యాచ్‌

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక విక్ట‌రీలు న‌మోదు చేసిన జ‌ట్లుగా ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ గుర్తింపు సంపాదించుకున్నాయి. అయితే ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో మాత్రం ఈ రెండు జ‌ట్లు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాయింట్ల పట్టిక‌లో అట్ట‌డుగున కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు చేజార్చుకున్న ముంబై.. షెడ్యూల్ మేర‌కే మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే చెన్నై కూడా అదే రీతిన సాగుతున్నా... ఏదో టెక్నిక‌ల్ అంశాల ఆదారంగా ప్లే ఆఫ్స్ అవ‌కాశాలైతే ఆ జ‌ట్టుకు ఇంకా ఉన్నాయ‌నే చెప్పాలి.

ఇలాంటి త‌రుణంలో గురువారం రాత్రి ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై జ‌ట్టుతో చెన్నై జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం ద్వారా పెద్ద‌గా ఒరిగేదేమీ లేదు. అయితే చెన్నై మాత్రం ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ముంబై మాదిరే ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను వ‌దిలేసుకోవాల్సి వ‌స్తుంది. వెర‌సి ఈ మ్యాచ్ చెన్నై జ‌ట్టుకు చావో రేవో మాదిరిగా ప‌రిణ‌మించింద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ మ్యాచ్‌లో విజయంతో చెన్నై జ‌ట్టు త‌న ఫ్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకుంటుందో, లేదంటే ముంబై చేతిలో ఓడి ముంబై మాదిరే ఇంటిదారి ప‌డుతుందో చూడాలి.

Chennai Super Kings
Mumbai Indians
Wankhede Stadium
IPL 2022
  • Loading...

More Telugu News