Rakhi: ప్రధాని మోదీకి అతిపెద్ద రాఖీని కానుకగా ఇచ్చిన గుజరాత్ మహిళలు

 Gujarat women gifts PM Modi a huge Rakhi

  • ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
  • వర్చువల్ గా ప్రసంగించిన మోదీ 
  • భారీ రాఖీ బహూకరించిన బరూచ్ మహిళలు
  • తనకు కోట్లాది మహిళల రక్షణ ఉందన్న మోదీ 

ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గుజరాత్ లోని బరూచ్ కు చెందిన మహిళలు భారీ కానుక సమర్పించారు. ప్రధాని మోదీని తమ సోదరునిగా భావించి అతిపెద్ద రాఖీని ఆయనకు అందజేశారు. మహిళల గౌరవం, సౌకర్యవంతమైన జీవనం దిశగా ప్రధాని మోదీ సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు రాఖీ బహూకరించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

అందుకు ప్రధాని మోదీ బదులిస్తూ... గుజరాత్ మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. రాఖీ రూపంలో తనకు ఎనలేని బలాన్ని అందించారని తెలిపారు. దేశాభివృద్ధి, మహిళల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడేలా పనిచేసేందుకు ఈ రాఖీ స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానని, ఆ క్రమంలో తనకు రక్షణకవచంలా పనిచేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తాను గుజరాత్ లో వున్నప్పుడు తన రక్షణకు సంబంధించి అనేక ఆందోళనలు తలెత్తేవని, అయితే, కోట్లాది మంది తల్లుల రక్షణ తనకుందని చెప్పేవాడినని మోదీ గర్వంగా అన్నారు. 

Rakhi
Modi
Women
Gujarat
  • Loading...

More Telugu News