Cricket: టీమిండియా మాజీ సారథి ధోనీ సినీ రంగ ప్రవేశం!

MS Dhoni To Produce A Movie In Kollywood

  • కోలీవుడ్ లోకి నిర్మాతగా అడుగు
  • నయనతార హీరోయిన్ గా సినిమా
  • త్వరలోనే సినిమా ప్రకటన

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇక సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే, హీరోగా మాత్రం కాదు. నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే నిర్మాతగా కోలీవుడ్ లోకి అడుగు పెట్టుబోతున్నాడని తెలుస్తోంది. 

ధోనీ నిర్మాణ సంస్థలో రాబోయే ఆ తొలి సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం. ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ద్వారా తమిళ అభిమాన గణాన్ని పెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా ద్వారా ఆ అభిమాన బలగాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైపోయాడు. 

కాగా, ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దిశా పటానీ, కియారా అద్వానీల కాంబోలో ‘ఎంఎస్ ధోనీ–ద అన్ టోల్డ్ స్టోరీ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయవంతమైంది.

Cricket
Cinema
MS Dhoni
Kollywood
Nayanthara
  • Loading...

More Telugu News