Viral Videos: రైలు కింద ప‌డ‌బోయిన‌ మ‌హిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో

constable saved the life of a lady passenger

  • ఒడిశాలోని భువనేశ్వర్ లో ఘ‌ట‌న‌
  • క‌దులుతోన్న రైలు నుంచి దిగ‌బోయిన మ‌హిళ‌
  • ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయిన వైనం

క‌దులుతోన్న రైలు నుంచి దిగ‌వ‌ద్ద‌ని రైల్వే శాఖ‌ ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌యాణికులు మాత్రం ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కే పాల్ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. రైలు కింద ప‌డ‌బోయిన‌ ఓ మ‌హిళ ప్రాణాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముందా కాపాడాడు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. రైలు క‌దులుతోన్న స‌మ‌యంలో ఓ మ‌హిళ దిగ‌బోతుండ‌గా ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి కానిస్టేబుల్ ఆమెను ప్లాట్‌ఫాం మీద‌కు లాగడంతో ప్రాణాపాయం త‌ప్పింది. సదరు కానిస్టేబుల్‌పై అధికారులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. రైల్వే స్టేష‌న్ల‌లో త‌రుచూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

Viral Videos
Odisha
Train Accident

More Telugu News