TSSPDCL: తెలంగాణలో తొలి లైన్ ఉమన్‌గా రికార్డులకెక్కిన శిరీష
![sirisha is the first line woman in telengana](https://imgd.ap7am.com/thumbnail/cr-20220511tn627be37f80f72.jpg)
- ఇటీవలే టీఎస్ఎస్పీడీసీఎల్‌లో లైన్ మన్ల భర్తీ
- లైన్ ఉమన్‌గా దరఖాస్తు చేసుకున్న శిరీష
- అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన యువతి
- మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న శిరీష
తెలంగాణలో తొలి లైన్ ఉమన్‌గా శిరీష అనే యువతి రికార్డులకెక్కింది. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఇటీవలే లైన్ మన్ల ఎంపిక చేపట్టగా... లైన్ ఉమన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న శిరీష.. అన్ని అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఫలితంగా లైన్ ఉమన్‌గా ఆమె ఎంపికైంది. దీంతో బుధవారం ఆమె లైన్ ఉమన్‌గా ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకుంది. సదరు నియామక పత్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆమెకు అందజేశారు.